Crime News:బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దు.. అని డీజీపీ బీసీ బంద్‌కు ఒకరోజు ముందుగా జారీ చేసిన హెచ్చరికలు. అయితే ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ బీసీ బంద్ కార్యక్రమంలో భాగంగా అక్కడక్కడా కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. అలాంటి ఘటనలకు బాధ్యులైన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు.
Crime News:హైదరాబాద్ నగరంలోని విద్యానగర్ నుంచి బర్కత్‌పురాం నుంచి బీసీ జేఏసీ నేతలు ర్యాలీతీశారు. ఈ సమయంలో వివిధ దుకాణాలు, షోరూంలు, ఒక పెట్రోల్ బంక్‌పై వారిలో కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడులకు పాల్పడిన 8 మంది మందిని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నల్లకుంట, కాచిగూడ పోలీస్ స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని నిన్న అర్ధరాత్రే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.