Crime News: యూట్యూబ్ లో వీడియో చూసి ఓ మహిళను హత్య జరిగింది. బంగారు ఆభరణాలను తీసుకొని అప్పులు తీర్చుకోవాలని ప్లాన్ చేసుకుని ఆమెను హత్య చేశాడు నిందితుడు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం ఉగ్రేపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
నరసింహమూర్తి నాలుగు నెలల క్రితం కర్ణాటక ప్రాంతం అరిసికెర ఉన్న ఉమాదేవికి ఫోన్ చేసి పావగడ రమ్మని చెప్పాడు. తను కూడా బెంగళూరు నుండి బస్సులో వచ్చి మడకశిరకు చేరుకున్నాడు. అక్కడి నుండి కదిరేపల్లి గ్రామంలో తన ఇంటి వద్దకు చేరుకొని స్నేహితుడు వద్ద ఒక ద్విచక్ర వాహనాన్ని పావుగడకి వెళ్ళాలి అంటూ అడిగి తీసుకున్నాడు. ఇంటి దగ్గర ఒక తాడుని బ్యాగులో తీసుకొని వెళ్ళాడు. పావగడ బస్టాండులో అప్పటికే ఉమాదేవి చేరుకొని ప్రియుడు కోసం ఎదురు చూస్తుండగా ద్విచక్ర వాహనంలో ఉమాదేవిని ఉగ్రేపల్లి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఇద్దరు శారీరకంగా కలుసుకోవచ్చని నచ్చజెప్పి తీసుకొని వెళ్ళాడు. తన కోరిక తీర్చుకున్న తర్వాత తన వంటిపై ఉన్న బంగారు నగలు దొంగిలించుటకు తగిన సమయం అనుకొని తనతో తెచ్చుకున్న తాడుతో గొంతు బిగించి చంపేశాడు.
Crime News: మెడలో ఉన్న బంగారు చైన్ చెవులకు ఉన్న కమ్మలు ముక్కు పుడక చోరీ చేశాడు. ఆ తర్వాత ఉమాదేవి శవాన్ని అక్కడే వంకలో ఇసుకతోటి పాతి పెట్టాడు. తర్వాత బైకు మీద మడకశిరకు వచ్చి దొంగలించిన ఒక బంగారు పుస్తెలతాడును మడకశిర ముత్తూట్ ఫైనాన్స్ లో కుదువ పెట్టి కర్ణాటక బ్యాంకులో తన సొంత అకౌంట్లోకి డబ్బును జమ చేసుకున్నాఇంటి దగ్గరికి వెళ్లి పారనును తీసుకొని వెళ్లి ఉమాదేవి పూడ్చి పెట్టిన స్థలానికి వెళ్లి ఇసుకలో గుంతను తవ్వి శవాన్ని పాతి పెట్టాడు.
Also Read: Vizag: మధురవాడలో ఉన్మాది ఘాతుకం – ప్రేమపేరుతో యువతి, తల్లిని హత్య
అక్కడి నుండి బెంగళూరుకు వెళ్లి మళ్లీ నెలరోజుల తర్వాత అక్కడ ఆనావాళ్లు ఎలా ఉన్నాయంటూ హత్య చేసి, పూడ్చి పెట్టిన స్థలాన్ని నిందితుడు ఒక్కసారి చూసుకొని వెళ్ళాడు. శవం మూడు నెలల తర్వాత అక్కడ కుళ్ళిపోయి దుర్వాసన రావడంతో వీధికుక్కలు శవాన్ని పీకు తింటుండగా అటుగా వెళ్లిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం మీద నాలుగు నెలల అనంతరం అనుమానాస్పద హత్య కేసును నమోదు చేసిన పోలీసులు కేసు ఛేదించారు. నిందితుడ్ని విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.