Crime News: చిన్నారులకు కనీసం ఐదేండ్ల వయసొచ్చేదాకా కంటికి రెప్పలా చూసుకోవాలి.. కాలు కదిపితే కనిపెట్టాలి.. చేయి తీస్తే పరిసరాలు చూసుకోవాలి.. అలాంటిది కారు ఉన్న కుటుంబాలు మరింతగా జాగరూకతతో ఉండాలి. కానీ, ఓ ఐదేండ్ల చిన్నారి కారులో చిక్కుకొని ఊపిరాడక కానరాని లోకాలకు వెళ్లిపోయింది.
Crime News: రంగారెడ్డి జిల్లా మక్తమాధారం గ్రామంలో ఐదేండ్ల వయసున్న చిన్నారి అక్షయ (5) ఆడుకుంటున్నది. బయటకు వెళ్లడంతో ఇంటి ఎదుట నిలిపి ఉంచిన కారు కనిపించింది. బుడిబుడి నడకలతో ఎంచక్కా ఆకారులో ఎక్కి కూర్చున్నది. సరదా తీర్చుకున్నది. ఈ లోగా దిగి ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే కారు డోర్ రావడం లేదు. అంతకుముందే కారు డోర్ లాక్ పడింది.
Crime News: ఎంతగా ప్రయత్నించినా కారు డోర్ రాలేదు. దీంతో ఊపిరాడక ఆ కారులోనే ఆ చిన్నారి ప్రాణాలిడిసింది. కారులోకి ఎక్కడం తెలిసినా డోరు తీయడం తెలియని ఆ చిన్నారి కానరాని లోకాలకు మళ్లిపోయింది. ఆ బాలిక తన నిండు జీవితాన్ని కోల్పోగా, ఆ తల్లిదండ్రులకు గుండె శోకం మిగిల్చింది.
Crime News: చాలా సేపయినా చిన్నారి కనిపించకపోవడంతో ఇళ్లంతా వెతికారు ఆ బాలిక కుటుంబ సభ్యులు. ఇంటి పరిసరాల్లోనూ చూశారు. ఇరుగు పొరుగు ఇండ్లలోనూ చూసొచ్చారు. కానీ, ఎక్కడ ఆచూకీ దొరకలేదు. దీంతో కారు డోర్ ఓపెన్ చేసి చూడగా ఆ కారులోనే ఆ బాలిక విగతజీవిగా పడి ఉన్నది. దీంతో గుండెలవిసేలా ఆ బాలిక తల్లిదండ్రులు విలపించసాగారు.