Crime News: ఇద్దరివీ ఇరుగు, పొరుగు ఇళ్లు.. ఆ యువకుడు పక్కింట ఒంటరిగా ఉండే వివాహితను చెల్లి అని పిలిచేవాడు. ఆమె సోదరభావంతో ఉండేది. ఇరు కుటుంబాలు స్నేహభావంతో ఉండేవారు. ఆ యువకుడికి ఏమైందో ఏమో కానీ, పక్కింటి ఆ వివాహితపై కన్నుపడింది. ఎవరూ లేనిది చూసి ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. అనూహ్య ఘటనతో ఆ మహిళ ప్రతిఘటించింది. దీంతో అతనిలో రాక్షసత్వం జడలు విప్పి మృగంలా మారింది. ఆ మృగం ఎదుటి మహిళను ఉసురు తీయడంతోపాటు తానూ ప్రాణం తీసుకున్నది.
Crime News: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహిత నివాసం ఉంటున్నది. ఆమె భర్త ఉద్యోగం నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. ఆమె ఇంటిపక్కనే ఉండే శ్రీకాంత్ తో సోదరభావంతో ఉండేది. అతను కూడా చెల్లి అని పిలుస్తూ సోదరిలా చూసేవాడు. కానీ, ఒంటరిగా ఉండటంతో ఆమెపై కన్నేశాడు. ఎలాగైనా తన కోరిక తీర్చుకోవాలని చూశాడు.
Crime News: శ్రీకాంత్ భార్య ఓ రోజు తన పుట్టింటికి వెళ్లింది. అదే రోజు పక్క ఇంటిలో ఉండే రేఖ శ్రీకాంత్ ఇంటిలోకి అన్నా అంటూ వెళ్లింది. తన భార్య లేకపోవడంతో తనకు అడ్డు లేదని అనుకున్నట్టున్నాడు. ఇదే అదనుగా భావించి, ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టపోయాడు. దీంతో హతాశురాలైన ఆమె ప్రతిఘటించింది. అతని నుంచి తప్పించుకోజూసింది.
Crime News: రాక్షసుడిగా మారిన ఆ దుండగుడు ఆమెను ఎలాగైనా లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఎంతకూ లొంగకపోవడంతో మృగంలా మారాడు. తన బాగోతం బయటపడుతుందని భయపడ్డాడో, పరువు పోతుందని అనుకున్నాడో కానీ, ఆక్రోశంతో కొడవలి తీసుకొని రేఖను నరికి చంపాడు. ఆ వెంటనే శ్రీకాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరూ విగతజీవులుగా పడిఉన్నారు.
Crime News: చెల్లి అని పిలుస్తూ రేఖపై శ్రీకాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడబోయిన ఘటన, హత్య, ఆత్మహత్యపై గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. పోస్టుమార్టం నిమిత్తం ఇద్దరి మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.