Crime News: నేటి సమాజం ఆందోళనకర స్థాయికి చేరుకుంటుందనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. తన ప్రేమకు అడ్డొస్తున్నదని ఏకంగా కన్నతల్లితే తన ప్రియుడితో కలిసి ఓ మైనర్ బాలిక హతమార్చిన ఘటనను మరువక ముందే.. బెట్టింగ్ ఆడొద్దన్న కన్నతండ్రిని ఏకంగా గొంతులో కత్తితో పొడిచి ఓ 19 ఏళ్ల యువకుడు దారణ హత్యకు పాల్పడ్డాడు.
Crime News: వనపర్తి జిల్లా ఘన్‌పూర్ మండలం కోతులకుంట తండాకు చెందిన కేతావత్ హనుమంతు (37).. తన భార్య, ఇద్దరు కొడుకులైన రవీందర్ (19), సంతోష్‌తో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్ గచ్చిబౌలి ఎన్టీఆర్ నగర్‌కు వలసొచ్చారు. హనుమంతు భవన నిర్మాణ మేస్త్రీ పనిచేస్తుండగా, పెద్ద కొడుకు ఇంటర్ పూర్తిచేశాడు. ఆ తర్వాత జులాయిగా తిరుగుతూ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు. ఈ బెట్టింగ్‌లో తరచూ డబ్బులు పోగొట్టుకున్నాడు.
Crime News: ఇటీవల అప్పులు పెరగి, కొడుకుల చదువుల కోసం డబ్బుల కోసమని హనుమంతు సొంతూరిలోని భూమిని తాకట్టు పెట్టి రూ.6 లక్షలు అప్పుగా తెచ్చాడు. ఆ డబ్బులపై హనుమంతు పెద్ద కొడుకు రవీందర్ కన్నుపడింది. బ్యాంకులో వేస్తే డబ్బులు భద్రంగా ఉంటాయని తల్లిదండ్రులను నమ్మించిన రవీందర్ తన అకౌంట్‌లో రూ.2.5 లక్షలను జమ చేయించుకున్నాడు.
Crime News: తన ఖాతాలో జమ చేసిన ఆ రూ.2.5 లక్షలను రవీందర్ బెట్టింగ్ యాప్‌లో జూదమాడి పోగొట్టుకున్నాడు. ఈ దశలో డబ్బులు బ్యాంకు నుంచి తీసుకొద్దామని తండ్రి చెప్పగా, తన స్నేహితునికి ఇచ్చానని, త్వరలో ఇస్తానన్నాడని ఊరడించాడు. ఈ సందర్భంగా అనుమానం వచ్చిన హనుమంతు బెట్టింగ్ ఆడి పోగొట్టావా? ఏంటి అంటూ నిలదీశాడు. ఇకనైనా బెట్టింగ్ ఆపాలని తండ్రి కోరాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య గొడవ అయింది.
Crime News: ఈ క్రమంలో తండ్రి హనుమంతుపై రవీందర్ కక్ష పెంచుకున్నాడు. మళ్లీ డబ్బు గురించి అడిగితే తన స్నేహితుడు ఇచ్చేందుకు వస్తున్నాడని, ఎన్టీఆర్ నగర్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన స్నేహితుడు డబ్బులతోపాటు సర్‌ప్రైజ్ ఇస్తాడని నమ్మించి తండ్రి కళ్లకు రవీందర్ గంతలు కట్టాడు.
Crime News: కన్నకొడుకు మాటలతో ఉబ్బి తబ్బిబ్బయిన తండ్రి నిజమేనని నమ్మాడు. ఈ సమయంలో తండ్రిని మాటల్లో పెట్టి అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రి గొంతులో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలి హనుమంతు చనిపోయాడు. ఇలాంటి అమానుష ఘటన మరో తండ్రీకొడుకుల మధ్య జరగొద్దని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రాథమిక స్థాయిలో పెంపకంలో వచ్చి లోపమే ఇలాంటి దారుణానికి దారి తీస్తుందని మానసిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.