Crime News:

Crime News: మెద‌క్ లైంగిక‌దాడిలో విస్తుగొలిపే వాస్త‌వాలు వెల్ల‌డి

Crime News: మెద‌క్ జిల్లాలో ఇటీవ‌ల ఓ మ‌హిళా కూలీపై జ‌రిగిన లైంగిక‌దాడి ఘ‌ట‌న‌లో బాధ్యుడిని పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా ఘ‌ట‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను పరిశీలించిన పోలీసులు, నిందితుడి ఆన‌వాళ్ల‌ను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచార‌ణ నిందితుడు తెలిపిన విష‌యాలు విస్తుగొలిపేలా ఉన్నా, ఆ దుండగుడి వ‌ల్ల ఓ నిండు ప్రాణం బ‌లైంది. అది ఆ కుటుంబానికి పూడ్చ‌లేని లోటుగా ప‌లువురు భావిస్తున్నారు.

Crime News: మెద‌క్ జిల్లా జాన‌కంప‌ల్లి గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోని ఓ తండా నుంచి ఒక మ‌హిళా కూలీ కూలిప‌నుల కోసం మెద‌క్ జిల్లా కేంద్రానికి వెళ్లింది. కూలి ప‌నులు ఉన్నాయంటూ వ‌చ్చిన ఆ దుండుగుడు ఆమెను కొల్పారం మండ‌లం అప్పాజిప‌ల్లి స‌మీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ప‌లుమార్లు దాడి చేసి, ఆమెపై భౌతిక దాడికి దిగాడు. ఆమెను వివ‌స్త్ర‌ను చేసి, అక్క‌డే ఓ చెట్టుకు తాళ్ల‌తో బంధించి వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత స్థానికులు గుర్తించి, పోలీసుల‌కు తెలుప‌గా, చికిత్స కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, చికిత్స పొందుతూ ప్రాణాలిడిసింది.

Crime News: ఈ అమానుషానికి పాల్ప‌డింది ఫ‌కీర్ నాయ‌క్ అనే ఓ పాత నేర‌స్థుడిగా పోలీసులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా అంబోజిగూడ‌లో నివాసం ఉంటున్న స‌మ‌యంలో ఓ మ‌హిళ‌ను హ‌త్యాచారం చేసిన కేసుతోపాటు మ‌రో 7 కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. వాటిలో ఓ కేసులో అక్టోబ‌ర్ 13న తుది తీర్పు వ‌స్తుంద‌ని, కోర్టు జీవిత ఖైదు విధిస్తుంద‌ని తెలిసి, తీలోగా త‌న కామ‌వాంఛ తీర్చుకోవాల‌ని ఈ దుర్మార్గానికి ఒడిగ‌ట్టాడ‌ని పోలీసుల విచార‌ణ తేలింది.

Crime News: కూలిప‌నులు ఇస్తాన‌ని న‌మ్మించిన ఫ‌కీర్‌నాయ‌క్‌.. ఆ మ‌హిళ‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ప్ర‌తిఘ‌టించిన ఆ మ‌హిళ‌పై దాడికి పాల్ప‌డ్డాడు. రాత్రంతా ఆమెను చెట్టుకు క‌ట్టేసి ఉంచాడు. ఆ త‌ర్వాత ప‌క్క‌నే ఉన్న చ‌ర్చి వ‌ద్ద బ‌ట్ట‌లు మార్చుకొని రాత్రంతా అక్క‌డే నిద్రించాడు. ఇవ‌న్నీ చేసిన దుండ‌గుడు ఫ‌కీర్‌నాయ‌క్ అని సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్న‌ది. దీంతో అత‌డిని అరెస్టు చేసి విచారించ‌గా, అస‌లు నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *