Crime News:ఏపీలో ఓ బస్సు మళ్లీ మాయమైంది. ఆర్టీసీ డ్రైవర్ ఓ బస్టాండ్‌లో పెట్టి, నిద్రిస్తుండగా, ఓ దుండగుడు ఏకంగా ఆబస్సును తోలుకొని వెళ్లాడు. ఈ విసయాన్ని అక్కడి అధికారులు, సిబ్బంది గమనించనేలేదు. ఇలా గతంలో ఏపీలోనే రెండు చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలతో ప్రమాదాలు సైతం చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతున్నది.
Crime News:నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోనకు చెందిన బస్సు ఏఎస్ పేట నుంచి నెల్లూరు బస్టాండ్‌కు ఆర్టీసీ డ్రైవర్ తోలుకొచ్చాడు. బస్సును పార్కు చేసిన డ్రైవర్ రాత్రి కావడంతో రెస్ట్ రూంలో నిద్రపోయాడు. తెల్లారే సరికి బస్సు మాయమైంది. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా బుచ్చిరెడ్డిపాలెం టోల్‌గేట్ వద్ద అదే బస్సును గుర్తించారు.
Crime News:బస్సును చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. విడవలూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన బిట్రగుంట కృష్ణగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు బస్సును ఎందుకు చోరీ చేసినట్టు అనే విషయాలు విచారణలో తేలనున్నాయి.

