Crime News: అమ్మ పెట్టిన గోరుముద్దలను అమృతంలా ఆరగించారు ఆ పిల్లలు. అమ్మ చేతి పెరుగన్నం కమ్మగా ఉన్నదని అనుకుంటూ ఆభగా తిన్నారు. కానీ, ఆ పెరుగన్నంలోనే విషపు గుళికలు ఉన్నాయని తెలియక తిన్న ఆ పిల్లల ఆయువు గాలిలో కలిసింది. అదే అన్నం ఆరగించిన ఆ తల్లి నేడు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది. బిడ్డలను కనురెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తల్లే వారి పాలిట మరణశాసనం లిఖించింది. నిండుగా నీరున్న బకెట్లలో ముంచి ఊపిరాడకుండా చేసి తన కొడుకులను అమానుషంగా ఊపిరితీసిన ఓ తండ్రి ఘటనను మరువక ముందే తెలంగాణలో మరో అమానుష ఘటన కలచివేసింది.
Crime News: రంగారెడ్డి జిల్లా మెడకపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్య, రజిత దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. చెన్నయ్య వాటర్ వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య రజిత ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నది. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
Crime News: ఈ గొడవలు నిత్యకృత్యం కావడంతో రజిత బతికి ఉండి లాభం లేదనే క్షణికావేశానికి లోనైంది. దీంతో అనుకున్నదే తడవుగా తాను చనిపోతే తన పిల్లలను ఎవరు చూసుకుంటారని అనుకున్నదో ఏమో? తన పిల్లలనూ చంపి, తాను చనిపోవాలని కఠోర నిర్ణయం తీసుకున్నది. భర్త విధుల్లోకి వెళ్లగా, దానిని అమలు చేయాలని అనుకున్నది.
Crime News: భర్త డ్యూటీకి వెళ్లగా గత రాత్రి ముందుగా పిల్లలకు అన్నంలో విషయం కలిపి పెట్టింది. అమ్మ పెట్టిన అన్నంలో విషయం ఉంటుందా? కల్మషం ఉండదు కదా! ఆ విషయం అభం శుభం తెలియని ఆ పిల్లలకేం తెలుసు! ఆభగా, ఆనందంగా తిన్నారు. దీంతో వారి ముగ్గురు పిల్లలైన సాయికృష్ణ (12), మధు ప్రియ (10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూశారు. అదే విషం కలిపిన అన్నం రజిత కూడా తిన్నది.
Crime News: అదేరాత్రి 11 గంటలకు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన చెన్నయ్య పిల్లలు, భార్య నోటి నుంచి నురగలు రావడం, అచేతనంగా పడి ఉండటాన్ని గమనించాడు. దాంతో ఆతృతగా చూసిన ఆయనకు పిల్లలు అప్పటికే చనిపోయి ఉన్న విషయాన్ని గుర్తించాడు. భార్య ప్రాణాపాయ స్థితిలో ఉండగా, స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. తన భార్య రజిత పెరుగన్నంలో విషం కలిపి పిల్లలకు ఇచ్చినట్టు పోలీసులకు చెన్నయ్య తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోద చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

