Crime News: మేఘాలయ హనీమూన్ హత్య ఘటనను మరువక ముందే హనీమూన్ పేరిట మరో అమానుష ఘటన వెలుగు చూసింది. వివాహేతర బంధం కోసం పేగుబంధాన్ని కూడా కడతేరుస్తున్న ఘటనల వరుసలో ఇదీ కలిసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇద్దరు చిన్నారులు తల్లి చేతిలోనే హతమై కానరానిలోకాలకు వెళ్లిపోయారు.
Crime News: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్ ప్రాంతంలోని రోడ్కాలి గ్రామానికి చెందిన వసీం, ముస్కాన్ (24) దంపతులు. వీరికి అర్హాద్ (5), ఇనాయ (1) అనే ఇద్రు పిల్లలు ఉన్నారు. భార్యా పిల్లల శ్రేయసు, కుటుంబ క్షేమం కోసం వసీం ఛండీగఢ్‌కు జీవనోపాధి కోసం వెళ్లాడు. అక్కడే నివసిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. ఇదే ఆ కుటుంబానికి శాపమైంది.
Crime News: వసీం ఛండీగఢ్‌లో ఉంటుండగా, ముస్కాన్ జునైద్ అనే వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకున్నది. తన భార్యా పిల్లల కోసం దూరంగా ఉంటూ, వారి క్షేమం కోరుకుంటున్న వసీంను కాదని జునైద్‌తోనే స్వర్గమనుకున్నది. అతనితోనే ఇక మిగిలిన జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నది. అనుకున్నదే తడవుగా జునైద్, ముస్కాన్ ఇద్దరూ హనీమూన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.
Crime News: భర్త అయితే దూరంగా ఉండి అడ్డుపడేదిలేదని, చిన్నారులైన ఇద్దరు తన సంతోషానికి అడ్డుగా ఉన్నారని ముస్కాన్ భావించింది. తన ప్రియుడితో హనీమూన్ వెళ్లేందుకు తన ఇద్దరు పిల్లలైన అర్హాన్, ఇనాయకు విషమిచ్చి ఆ కఠినాత్మురాలైన తల్లి చంపేసింది. ఈ విషయం పోలీసుల విచారణలో తేలడంతో నిందితులైన జునైద్, ముస్కాన్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.