Crime News: ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు.. కామాంధులు కండ్లల్లో నిప్పులే పోసుకుంటారు. అదీ అర్ధరాత్రి అయితే ఇక అడ్డూ అదుపే ఉండటం లేదు. ఇలాంటి ఘటనే ఒడిశాలో ప్రయాణిస్తున్న రైలులో చోటుచేసుకున్నది. అర్ధరాత్రి ఒంటరిగా వాష్‌రూంకు వెళ్లిన ఓ మైనర్‌ను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు ఓ దుండగుడు. చివరకు ఆ రైలు
సికింద్రాబాద్ చేరుకున్నాక పోలీసులు వలేసి ఆ దుండగుడిని పట్టుకున్నారు. అసలు రైలులో ఏమి జరిగిందో అన్న వివరాలు ఇలా ఉన్నాయి.
Crime News: ఈ నెల (ఏప్రిల్) 2న ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక రైలు కెల్దార్ రైల్వేస్టేషన్ దాటింది. 2 గంటల సమయంలో అతని మైనర్ (16) కూతురు వారు కూర్చున్న చోటుకు సమీపంలోనే ఉన్న ఓ వాష్‌రూంకు వెళ్లింది. అందరూ ఉన్నా నిద్రలో ఉన్నారనుకున్నాడో, తనకు ఎదురే లేదనుకున్నాడో ఏమో. ఓ దుండగుడు ఆ బాలికపై కన్నేశాడు.
Crime News: ఆ బాలికను అడ్డుపడి బెదిరించి లైంగికంగా వేధించాడు. ఇదే సమయంలో అతని సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు. అరిస్తే చంపుతానని బెదిరించడంతో ఆ బాలిక కిమ్మనకుండా ఉన్నది. కొంతసేపటికి ఆ బాలికను వదిలిపెట్టడంతో వెళ్లగానే తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది.
Crime News: వెంటనే ఆ వ్యక్తి, మరికొందరు వెళ్లి ఆ దుండగుడి వద్ద సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కొని చూడగా, వీడియోలు బయటపడ్డాయి. దీంతో వెంటనే రైల్వే టోల్ ఫ్రీ నంబర్ 139కు పోన్ చేసి ఆ బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. గురువారం రైలు సికింద్రాబాద్ చేరుకున్నాక అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Crime News: ఈ మేరకు ఆ నిందితుడిపై పోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద పలు కేసులను నమోదు చేశారు. ఇప్పటికే ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆ మైనర్ కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.