Crime News: హైదరాబాద్ నగరంలో అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత యువతి మృతి ఘటన పలు మలుపులకు తిరిగింది. సినీ ఫక్కీలో ఈ ఘటన చోటుచేసుకున్నది. హైదరాబాద్‌లో గుండెపోటుతో చనిపోయినట్టు ఆమె కుటుంబ సభ్యులకు తెలపగా, వారు హైదరాబాద్ ఆసుపత్రికి బయలుదేరి వచ్చారు. ఈ లోగా ఆమె మృతదేహాన్ని ఆమె స్వస్థలానికి తరలించారు. ఈ లోగా అనుమానంతో పోలీసులు సీసీ పుటేజీ ద్వారా గుర్తించి వాహనాన్ని అడ్డుకొని పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
Crime News: హైదరాబాద్ మలక్‌పేటలోని జమునా టవర్స్‌లో నివాసం ఉంటున్న సింగం శిరీష అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. శిరీష గుండెపోటుతో చనిపోయిందని మృతురాలి భర్త వినయ్‌కుమార్ ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు శిరీష కుటుంబ సభ్యులు, ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఆసుపత్రికి చేరుకోకముందే, వినయ్‌కుమార్ స్వ్రగ్రామమైన శ్రీశైలం సమీపంలోని దోమలపెంటకు అంబులెన్స్‌లో తరలించారు.
Crime News: అంబులెన్స్‌లో తరలిస్తున్న విషయాన్ని సీసీ పుటేజీ ద్వారా గుర్తించిన నగర పోలీసులు ఆ వాహనాన్ని నిలిపేశారు. అంబులెన్స్‌లో ఉన్న మృతదేహాన్ని పరిశీలించగా ముఖం, మెడపై గాయాలున్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో శిరీషను కొట్టి చంపి, గుండెపోటుగా చిత్రీకరిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.