Crime News: క్షణికావేశం అమానుష ప్రవర్తనకు దారితీస్తున్నది. ఆ ప్రవర్తన జీవితాలనే తారుమారు చేస్తున్నది. ఇది తెలిసి కూడా నిగ్రహించుకోలేక విపరిణామాలకు పాల్పడుతున్నారు. ఇక్కడా అదే జరిగింది. పెంచి పెద్ద చేసి, పెండ్లి ఖర్చులు ఎలా భరించాలి.. అని ఊహించుకొని సొంత కూతురినే చంపేసింది. ప్రమాదంగా చిత్రీకరించబోయి పోలీసులకు దొరికిపోయింది. హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Crime News: తమిళనాడుకు చెందిన మదులై మణి, ఆరోగ్య విజ్జి (32) దంపతులు హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో నివాసం ఉంటున్నారు. ఐడీఏ శాస్త్రిపురం అలీనగర్‌లోని ఓ కంపెనీలో దంపతులు ఇద్దరూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఏడాది కుమారుడు, మరో పాప ఉన్నారు. ఇటీవల భర్తకు అనారోగ్యం సోకి రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో కుటుంబ జీవనం కష్టంగా మారింది.
Crime News: భర్త కిడ్నీల వ్యాధితో చనిపోతే భవిష్యత్తు ఆర్థిక ఇక్కట్లను తలచుకొని మదనపడేది. ఇప్పటికే ఆర్థిక కష్టాలతో ఇల్లు గడవడమే కష్టంగా మారిందని, బిడ్డకు పెద్ద చేసి, పెండ్లి చేయాలంటే మరిన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతాయని విజ్జి భావించింది. రోజుల వయసున్న పాపను నీళ్లు ఉన్న బకెట్‌లో వేసింది. ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది.
Crime News: తాను స్నానం చేసి వచ్చేలోగా మంచంపై ఉన్న పాప కనిపంచడం లేదని కేకలు వేయసాగింది. ఈలోగా ఇంటిలో వెతికినట్టు నటిస్తూ బకెట్‌లో చూసి, గుర్తు తెలియని వ్యక్తులు నీళ్ల బకెట్‌లో పడేశారని అబద్ధాలాడింది. భర్తరాగానే ఇదే విషయాన్ని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రక్తి కట్టించింది. తల్లి చెప్పే విషయాలకు, అక్కడ పరిస్థితులకు పొంతనలేకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. పోలీసులకు హింట్ ఇవ్వడంతో చివరికి పోలీసుల విచారణలో చేసిన తప్పును ఒప్పుకున్నది. తాను ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చంపేసినట్టు తన తప్పును ఒప్పేసుకున్నది.