Crime News

Crime News: నాలుగేళ్ల బాలుడిని చంపి పూడ్చిపెట్టి పోలీసులకు చుక్కలు చూబెట్టిన 13 ఏళ్ల బాలిక

Crime News: రోజురోజుకు దారుణమైన వార్తలు వెలుగు చూస్తున్నాయి. నేరం చేయడం.. దానిని కప్పిపుచ్చడం కోసం రకరకాల పనులు చేయడం.. పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు.. ఇలా క్రైమ్ సీన్స్ దారుణంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఒక హత్యోదంతం షాక్ ఇచ్చేలా ఉంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 13 ఏళ్ల బాలిక నాలుగేళ్ల బాలుడిని హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని నిర్మాణ స్థలంలో పూడ్చిపెట్టిన వింతైన – దిగ్భ్రాంతికరమైన సంఘటన గురించి గురువారం పోలీసులు బయటపెట్టారు.

దేవరాజ్ శంకర్ అనే నాలుగేళ్ల బాలుని మృతదేహాన్ని నిర్మాణ స్థలంలోని గొయ్యి నుంచి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు దర్యాప్తులో 13 ఎల్లా అమ్మాయి ఆ బాలుడిని బిస్కెట్స్ ఇస్తానని చెప్పి నిర్మాణంలో ఉన్న ప్రదేశానికి రప్పించి, అతని గొంతు కోసి చంపి, అక్కడ రాతితో కొట్టిందని తేలింది. తరువాత ఆమె మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న ఇంటికి స్తంభాలను నిర్మించడానికి తవ్విన గొయ్యిలో పాతిపెట్టిందని పోలీసులు తెలిపారు.

గ్వాలియర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ధరమ్‌వీర్ యాదవ్ చెబుతున్న దాని ప్రకారం, మంగళవారం సాయంత్రం బాలుడు కనిపించకుండా పోయాడని అతని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ బాలుడు చివరిసారిగా ఆ అమ్మాయితో కలిసి కనిపించాడని తేలింది. దీని తరువాత, ఆ బాలికను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Minor Gang Rape: కృష్ణా జిల్లాలో వెలుగులోకి దారుణ ఘటన

పోలీసులకు చుక్కలు చూపించిన బాలిక!

Crime News: అయితే, ఆ బాలిక తన వాంగ్మూలాలను తరచూ మారుస్తూ పోలీసులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించింది, దీనితో నేరంలో ఆమె పాత్రపై అనుమానం వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ అబ్బాయికి బిస్కట్స్ ఇచ్చిన తర్వాత అతన్ని అక్కడే వదిలేశానని బాలిక విచారణలో చెప్పింది. తరువాత ఆమె తన వాంగ్మూలాన్ని మార్చుకుని, ఒక ‘బాబా’ తనను తీసుకెళ్లాడని చెప్పింది. ఆమె తనను ఒక దుష్ట శక్తి ఆవహించిందని చెప్పింది.

బాలిక చేస్తున్న చేష్టలతో పోలీసులకు మతి పోయింది. దీంతో ఆమె దారిలోనే ఆమెతో నిజం చెప్పించడానికి పెద్ద ప్లాన్ వేశారు. ఒక మహిళా పోలీసు ద్వారా చిన్న నాటకం ఆడించారు.
ఆ మహిళా పోలీసు అధికారిణి తనను దేవత ఆవహించినట్లుగా ప్రవర్తించి ఆమెను ప్రశ్నించడం ప్రారంభించింది. మెల్లగా ఆ బాలిక నుంచి నిజాలు రాబట్టింది ఆ అధికారిణి. తరువాత బాలిక శవాన్ని పాతిపెట్టిన సంఘటన స్థలానికి పోలీసులను తీసుకెళ్లింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు, నిందితులు స్థానిక నిర్మాణ స్థలంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. “హత్య వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇంకా నిర్ధారణ కాలేదు. నేరం స్వభావం మాకు ఆశ్చర్యం కలిగిస్తోంది” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *