Crime News: ఎక్సైజ్ శాఖలో కానిస్టుబుల్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అదే శాఖలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అవతారం ఎత్తాడు. ఈజీగా మనీ సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. దీనికి సినీ ప్రముఖులనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బెదిరింపుల ద్వారా అందినకాడికి దోచుకోవచ్చనే ప్లాన్ చేశాడు. అది వర్కవుట్ కాకపోవడంతో ఆ ఘనడు నేడు కటకటాలు లెక్కపెడుతున్నాడు.
Crime News: ఉమామహేశ్వరరావు అనే ఎక్సైజ్ కానిస్టేబుల్ తాను పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను అంటూ చెప్పుకోసాగాడు. సినీ ప్రముఖులను టార్గెట్ చేసుకున్నాడు. వారిళ్లకు స్వయంగా వెళ్లి అడిగినంత డబ్బు ఇవ్వాలని హుకూం జారీ చేశాడు. లేదంటే మీ ఇంటిలో డ్రగ్స్ దొరికిందంటూ కేసు బుక్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీనిపై పలువురిని వేధింపులకు గురిచేసినట్టు తెలుస్తున్నది.
Crime News: ఉమామహేశ్వరరావుపై అనుమానం కలిగిన సినీ ప్రముఖులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడైన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమామహేశ్వరరావే ఇదంతగా చేశాడా? ఈ తంతంగం వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

