Crime News: నిజామాబాద్ జిల్లాలో జరిగిన దారుణానికి ఒడిగట్టిన నిందితుడికి ఆ గ్రామస్థులు అప్పటికప్పుడే తీర్పు ఇచ్చేశారు. మూకుమ్మడిగా దాడి చేసిన మరణదండన విధించారు. న్యాయపరంగా ఇది సరికాదని తెలిసినా జరిగిన దారుణంపై ఆ ఊరి ప్రజలు ఉమ్మడిగా స్పందించి ఈ శిక్ష విధించడం కలకలం రేపింది. మరో దుండగుడు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాలంటే భయం గొలిపేలా జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
Crime News: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో ఓ బాలిక కిరాణా సరుకులు కొనేందుకు దుకాణానికి వెళ్లింది. ఆ దుకాణ నిర్వాహకుడైన వృద్ధుడు ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు దుండగుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. గ్రామస్థుల దాడిలో బలమైన గాయాలు కావడంతో ఆ వృద్ధుడు చనిపోయాడు. ఈ విషయం కాస్తా పోలీసులకు చేరడంతో వారొచ్చి గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
Crime News: వీరన్నగుట్ట గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. బాలికపై లైంగికదాడి చేశాడన్న ఆగ్రహంతో ఒక్కుమ్మడిగా గ్రామస్థులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని మానవతావాదులు కొందరు వాదిస్తుండగా, దుండగుడికి సరైన శిక్ష పడిందని, మరో దుండగుడు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాలంటేనే జంకేలా తగిన శాస్తి జరిగిందని ఇంకొందరు వాదిస్తున్నారు.