Crime News: సినీనటి రమ్యశ్రీ, అతని సోదరుడిపై దాడికి పాల్పడిన ఘటనలో ప్రముఖ హోటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావు, అతని అనుచరులు వెంకటేశ్ మరో ముగ్గురిపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గచ్చిబౌలి ఎఫ్‌సీఐ కాలనీలో ప్లాట్ల యజమానుల ఫిర్యాదు మేరకు వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Crime News: గచ్చిబౌలి ఎఫ్‌సీఐ కాలనీలో ప్లాట్ల యజమానుల సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా, వీడియో తీస్తున్న ప్లాట్ల యజమానులపై శ్రీధర్‌రావు అనుచరులు దాడికి దిగారు. హైడ్రా పోలీసుల సమక్షంలో అత్యంత వేగంగా కారు నడిపి తనను ఢీకొట్టబోయాడంటూ శ్రీధర్‌రావు అనుచరుడు వెంకటేశ్‌పై బాధితులు ఫిర్యాదు చేశారు.
Crime News: తిరిగి వెళ్లిపోతుండగా, రోడ్డుపై కేటీఎం బైక్‌తో వచ్చి కారుపై రాళ్లదాడి చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. శ్రీధర్‌రావు అతని అనుచరుడైన వెంకటేశ్ ఆదేశాలతో వారి అనుచరులు తమపై తీవ్రంగా దాడికి దిగారంటూ తెలిపారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉన్నదంటూ బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు.
Crime News: ఈ మేరకు సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావు, అతని అనుచరులు వెంకటేశ్ మరో ముగ్గురిపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిపై 115 (2), 126(2), 324(5), 125(ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు.