Crime News: తన భార్య తనను వదిలేసి వెళ్లిందని ఓ ఆటో డ్రైవర్‌లో రాక్షసత్వం చేరింది. దానికి ఓ మహిళే కారణమని భావించిన అతను.. ఆ మహిళపై కసి పెంచుకున్నాడు. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని పగబట్టాడు. అభం శుభం తెలియని ఓ ఐదేండ్ల బాలుడిని కసితీరా చంపి అమానుషానికి ఒడిగట్టాడు. మానవ మృగంలా మారిన అతను ఇప్పుడు పోలీసుల అదుపులో కటకటాలు లెక్కిస్తున్నాడు.
Crime News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా అరుణోదయ కాలనీలో ఉండే ఆటో డ్రైవర్ పెన్నయ్య భార్య కుటుంబ గొడవ కారణంగా ఇటీవల అతన్ని వదిలి పుట్టింటికి వెళ్లింది. తన భార్య తనను వదిలివేయడానికి అదే కాలనీలో ఉండే గోవిందు హరి భార్య నాగవేణి కారణమని ఆటో డ్రైవర్ పెన్నయ్య భావించాడు. ఆమెపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు.
Crime News: నాగవేణి, గోవిందు హరి దంపతుల ఇంటికి వెళ్లిన ఆటో డ్రైవర్ పెన్నయ్య.. వారి ఐదేండ్ల కుమారుడైన సుశాంత్ (5)ను కిడ్నాప్ చేశాడు. ఆ బాలుడిని ఓ సంచిలో మూట కట్టి తీసుకెళ్లాడు. దూరంగా తీసుకెళ్లి అభశుభం తెలియని ఆ బాలుడి గొంతు నులిమి, మృతదేహాన్ని కంపచెట్ల మధ్యలో ఆటో డ్రైవర్ పెన్నయ్య విసిరేసి వెళ్లిపోయాడు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలతో అతని భార్య ఇల్లు విడిచి వెళ్లిపోతే.. మరో మహిళను కారణంగా భావించిన దుండగుడు పసిప్రాణాన్ని బలితీసుకోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Crime News: నాగవేణి, గోవిందు హరి దంపతులు ఆసుపత్రికి వెళ్లొచ్చే సరికి పెన్నయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికొచ్చే సరికి తన కుమారుడు లేడని భావించిన నాగవేణి.. తన నాయనమ్మ ఇంటిలో ఉన్నాడేమోనని భావించింది. అక్కడే పడుకుంటాడని దంతపలు ఇద్దరూ ఇంటిలో పడుకన్నారు. తెల్లారి లేచి చూసే సరికి బాలుడు కనిపించలేదు. దీంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. అనుమానంతో ఆటో డ్రైవర్ పెన్నయ్యను విచారించగా, బాలుడిని తానే హత్య చేసినట్టు పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. నిందితుడు పెన్నయ్యను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

