Cricket: మహిళల ప్రపంచ కప్ 2025: దూకుడుగా దూసుకుపోయిన ఆస్ట్రేలియా

Cricket: మహిళల ప్రపంచ కప్ 2025లో ఆస్ట్రేలియా జట్టు రన్‌ వేగాన్ని పెంచుతూ దూకుడుగా ఆడుతోంది. మ్యాచ్ ప్రారంభం నుంచే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా, తొలి 20 ఓవర్లలోనే 135/1 స్కోర్‌ను సాధించింది.

ఈ దశలో ఫోబీ లిచ్‌ఫీల్డ్ 83 పరుగులతో, ఎలిస్ పెర్రీ 37 పరుగులతో క్రీజులో నిలకడగా కొనసాగారు. ఇద్దరు బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ బౌండరీలు, రన్నుల వర్షం కురిపించారు.

అయితే తర్వాత, ఆసీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఫోబీ లిచ్‌ఫీల్డ్ 93 బంతుల్లో 119 పరుగులు చేసి దుమ్ము దులిపినా, చివరికి AB కౌర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యింది. లిచ్‌ఫీల్డ్ వికెట్ పడే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ 180/2గా ఉంది.

ప్రస్తుతం పెర్రీ క్రీజులో ఉండగా, ఆస్ట్రేలియా మరింత పెద్ద స్కోర్ వైపు దూసుకెళ్తోంది. బ్యాటింగ్ తీరును బట్టి చూస్తే భారీ స్కోర్ సాధించే అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *