Cricket: ఉమెన్స్ వన్‌డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు గంటలు మాత్రమే ఉండడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. నవీ ముంబై వేదికగా జరిగే ఈ తుదిపోరులో భారత్ మహిళా జట్టు దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. చారిత్రాత్మక విజయాన్ని అందుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు టీవీల ముందే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు వాతావరణం ఆటపై ప్రభావం చూపింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. స్టేడియం వద్ద కూడా భారీగా అభిమానులు చేరుకున్నారు. వాతావరణం అనుకూలిస్తే పటిష్టమైన జట్టుతో భారత్ మైదానంలోకి దిగే అవకాశం ఉంది.
భారత్ ఇప్పటి వరకూ చూపించిన ప్రదర్శన ఆధారంగా జట్టు విజేతగా నిలుస్తుందని క్రికెట్ పండితులు నమ్ముతున్నారు. మరోవైపు, దక్షిణాఫ్రికా కూడా బలమైన ప్రదర్శన చేస్తూ ఫైనల్‌కు చేరినందున ఈ పోటీ హై లోల్టేజ్‌గా కొనసాగే అవకాశం ఉంది.
కాసేపట్లో వాతావరణ అనుకూలిస్తే టాస్ జరుగుతుంది. అభిమానులంతా భారత జట్టు విజయం కోసం వేచిచూస్తూ, సోషల్ మీడియాలో శుభాకాంక్షల సందేశాలతో సందడి చేస్తున్నారు.

