Cricket: ఆసియా కప్ 2025: దుబాయ్ వేదికగా పాక్ కకావికలం

Cricket: దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2025 హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ టాప్ ఆర్డర్ చిత్తు చిత్తుగా కూలిపోయింది.

ఇన్నింగ్స్ తొలి బంతికే హార్దిక్ పాండ్యా ఓపెనర్ సైమ్ అయూబ్ (0)ను పెవిలియన్‌కు పంపించాడు. కాసేపట్లోనే జస్ప్రీత్ బుమ్రా మరో ఓపెనర్ మహమ్మద్ హారిస్ (3)ను ఔట్ చేసి పాకిస్థాన్‌ను గట్టి కష్టాల్లోకి నెట్టాడు. కేవలం 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పాక్, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫఖర్ జమాన్ (17)తో కాసేపు ఆశలు పెట్టుకుంది. అయితే, స్పిన్నర్ అక్షర్ పటేల్ అతడిని పెవిలియన్‌ బాట పట్టించి పాక్ షాక్ ఇచ్చాడు.

తరువాత కెప్టెన్ సల్మాన్ అఘా (3) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అక్షర్ పటేల్ తన రెండో వికెట్‌గా అతడిని ఔట్ చేసి పాక్ పతనాన్ని మరింత వేగవంతం చేశాడు. కేవలం 2 ఓవర్లలో 3 పరుగులకే 2 కీలక వికెట్లు తీసిన అక్షర్ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.

తొలి 10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ 4 వికెట్ల నష్టానికి కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ ముందు పాక్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *