Cricket: రాజ్‌కోట్‌లో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మొదటి ఓవర్ల నుంచే ఒత్తిడి సృష్టించింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. రోహిత్ 24 పరుగులు చేసి ఔటవ్వగా, గిల్ 53 బంతుల్లో 56 పరుగులతో మెరిశాడు.
అయితే రోహిత్ ఔటైన తర్వాత భారత మిడిలార్డర్ పూర్తిగా తడబడింది. వరుసగా శ్రేయస్ అయ్యర్ 8, విరాట్ కోహ్లీ 23 పరుగులకే పెవిలియన్ చేరి భారత్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టారు.
కివీస్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్ మ్యాచ్ మోమెంటమ్‌ను మార్చాడు. తక్కువ సమయంలో మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు.
తాజా స్కోరు ప్రకారం భారత జట్టు 26.4 ఓవర్లలో 118 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా క్రీజులో ఉండి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
