Cricket Betting: ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను బెట్టింగ్ మాఫియా కలకలం రేపుతున్నది. ఈ బెట్టింగ్ యాప్‌ల వల్ల ఎందరో తమ జీవితాలను నష్టపోయారు. వారు నష్టపోవడానికి పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లే కారణమంటూ ఒకవైపు వారిపై కేసులు నమోదవుతున్నాయి. వారిని ఒక్కొక్కరినీ విచారిస్తూ, పోలీసులు లోతుగా దర్యప్తు కొనసాగిస్తున్నారు. ఈ దశలోనే మరో యువకుడు క్రికెట్ బెట్టింగ్ కారణంగా బలయ్యాడు.
Cricket Betting: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్ ఆడాడు. ఈ బెట్టింగ్ కారణంగా సుమారు రూ.2 లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ యువకుడు అదే జిల్లాలోని గౌడవెల్లి పరిధిలోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Cricket Betting: పోలీసులు ఎంతగా కట్టుదిట్టం చేయాలని చూస్తున్నా, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. ఇప్పటికే చాలా బెట్టింగ్ యాప్‌లను గూగుల్ స్టోర్ నుంచి తొలగించారు. అయినా ఇంకా పలు యాప్‌లు ఇలాంటి బెట్టింగ్ దందాలు నిర్వహిస్తూ అమాయకులైన ఎందరో యువతను నాశనం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి బెట్టింగ్ యాప్‌లను సినీ నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేయవద్దని, యువత ఈ యాప్‌లకు ప్రభావితమై నష్టపోవద్దని మానసిక విశ్లేషకులు సూచిస్తున్నారు.