Cricket Accidet: చిన్న పిల్లలకి రోజు ఆదుకునే వస్తువులు ఆయన చాలా డేంజరే.. రోజు ఆదుకునే బాలే కదా అనుకున్నారు.. ఆటల్లో దెబ్బలు సహజం కదా అనుకున్నారు.. కానీ ఆ బాలే ఆ చిన్నారి ప్రాణం తీస్తుంది అనుకోలేదు.. తాకినప్పుడు బానే ఉంది కానీ.. తర్వాత రోజే ప్రాణాల మీదకి వచ్చింది.. బాల్ తాకితేనే ప్రాణం పోతుందా..
క్రికెట్ బాల్ తగిలి ఓ బాలుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామానికి చెందిన దారం శ్రీనివాస్‌రెడ్డి వేములవాడలో తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన కుమారుడు అశ్వీత్‌రెడ్డి తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడడానికి వెళ్లాడు.. ప్రమాదవశాత్తూ క్రికెట్ బాల్ ఆశ్విత్ తలకు తగిలింది.
Also Read: Bengaluru: నడిరోడ్డుపై గొంతు కోసి చంపిన భర్త..
మరుసటి రోజు యథావిధిగా పాఠశాలకు వెళ్లిన అశ్విత్ రెడ్డి, తనకు తలనొప్పిగా ఉందని చెప్పడంతో బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తలలో గాయమై, రక్తస్రావం అవుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు.
మెరుగైన చికిత్స కొసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అశ్విత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

