Khaidi 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూలీ ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం లోకేష్ ఈ సినిమా విడుదల సన్నాహాల్లో నిమగ్నమయ్యాడు. ఈ నెలాఖరు నుంచి ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. విడుదల వరకు లోకేష్ బిజీ షెడ్యూల్‌తో గడపనున్నాడు. అటు లోకేష్ టీమ్ ఖైదీ 2 పనుల్లో మునిగిపోయింది. కూలీ విడుదల తర్వాత ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించనున్నాడు లోకేష్. ఖైదీ 2 స్క్రిప్ట్ ఖరారైంది, ప్రధాన పాత్రలు కూడా ఎంపికయ్యాయి. హీరోయిన్‌గా అనుష్క ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా షూటింగ్ పై క్రేజీ అప్డేట్?
ఈ చిత్రం తొలి షెడ్యూల్ కర్ణాటక అడవుల్లో జరగనుంది. అక్కడ అటవీ ప్రాంతంలో సెట్ నిర్మాణం జరుగుతోంది. సన్నివేశాలు సెట్, అడవితో సమన్వయం చేసేలా లోకేష్ సూచనలతో పనులు సాగుతున్నాయి. సాధారణంగా తొలి షెడ్యూల్ స్థానికంగా నిర్వహిస్తారు, కానీ లోకేష్ కర్ణాటకను ఎంచుకోవడం విశేషం. గతంలో లియో కోసం కూడా ఇలాంటి వ్యూహమే అనుసరించాడు. ఇక కార్తీ సర్దార్ 2, వా వాతయార్ చిత్రాల షూటింగ్ పూర్తి చేసి, డబ్బింగ్ పనులు చేపడుతున్నాడు. ఖైదీ 2 సెట్స్‌కు వెళ్లేలోగా ఈ పనులను ముగించనున్నాడు.