Balakrishna-Krish: నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో హ్యాట్రిక్ సినిమాకు రెడీ అవుతున్నట్లు సమాచారం. గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఈ కాంబో మళ్లీ ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తోంది. ఈసారి బాలయ్య అదిరిపోయే రోల్‌లో కనిపించనున్నారని టాక్. ఈ ప్రాజెక్ట్ ఎలాంటి ఊపు తెస్తుందో చూడాలి..
Also Read: Kingdom Twitter Review: హిట్ కొట్టిన విజయ్.. ‘కింగ్డమ్’ ట్విటర్ రివ్యూ
నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! అఖండ 2 తాండవం తర్వాత బాలయ్య మరో భారీ చిత్రంతో సిద్ధమవుతున్నారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో మూడోసారి చేతులు కలిపారు. గతంలో గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్‌లతో అలరించిన ఈ జోడీ ఈసారి కూడా అదిరిపోయే కథతో రాబోతోందని సమాచారం. బాలయ్య ఈ చిత్రంలో డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారని, గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు.