The Paradise: హిట్ 3తో సూపర్ హిట్ కొట్టిన నాని, దసరాతో తాను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేసిన శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మొన్నామధ్య రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే నాని షూట్ లో జాయిన్ అయ్యాడనే క్రేజ్ అప్ డేట్ ఇచ్చిన టీమ్.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు..
Also Read: War 2: వార్ 2 షూట్ కంప్లీట్.. హృతిక్ ఎమోషనల్ పోస్ట్..
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. మూవీలో ఈ సీక్వెన్స్ హైలెట్ కానుందని చెప్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ రియల్ సతీష్ కంపోజిషన్ లో, విదేశీ టెక్నీషియన్స్ తో యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నామని అప్ డేట్ ఇచ్చారు. మూవీ గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలనే టార్గెట్ తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పిక్చరైజ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.