Spirit: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్! ‘స్పిరిట్’ సినిమా హై ఓల్టేజ్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. మెక్సికోలో ప్రీ-ప్రొడక్షన్ వర్క్ విజయవంతంగా పూర్తైన ఈ చిత్రం, జూన్ నుంచి షూటింగ్ షురూ చేయడానికి సిద్ధమవుతోంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన ఈ అప్డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
Also Read: Mass Jathara: మాస్ జాతర నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది!
Spirit: ఇప్పటివరకూ మాస్ హీరోగా, లవర్ బాయ్‌గా అలరించిన ప్రభాస్, ఈ సారి పవర్‌ఫుల్ పోలీస్ రోల్‌లో కనిపించనున్నాడు. ఆయన క్యారెక్టర్ వివరాలు ఇంకా రివీల్ కానప్పటికీ, సస్పెన్స్‌తో కూడిన ఈ పాత్ర అందరినీ ఆకట్టుకోనుందని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ మార్క్ యాక్షన్ సీన్స్, టెక్నికల్ ఎక్సలెన్స్, గ్రిప్పింగ్ స్టోరీలైన్‌తో ‘స్పిరిట్’ బాక్సాఫీస్‌ను కుదిపేయడం పక్కా. త్వరలోనే కాస్టింగ్, క్రూ వివరాలతో సహా మరిన్ని హాట్ అప్డేట్స్ రానున్నాయి. ప్రభాస్-వంగ కాంబో థియేటర్లలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో చూడాలి!