Kantara Chapter-1

Kantara Chapter-1: కాంతార చాప్టర్ 1 నుంచి క్రేజీ అప్డేట్?

Kantara Chapter-1:  కన్నడ చిత్రసీమలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న ‘కాంతార చాప్టర్ 1’పై అభిమానుల ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. రిషబ్ శెట్టి పుట్టినరోజు జులై 7 నాటికి ఈ చిత్రం నుంచి కొత్త అప్డేట్‌ వచ్చే అవకాశం ఉందని టాక్. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం, కదంబ రాజవంశ కాలంలో సెట్ చేయబడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. రిషబ్ శెట్టి నాగ సాధువుగా సూపర్‌హ్యూమన్ శక్తులతో కనిపించనున్నారు.

Also Read: Allari Naresh: ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ కొత్త సినిమా ‘ఆల్కహాల్’!

Kantara Chapter-1:  2023 నవంబర్‌లో విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. ఈ సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అక్టోబర్ 2, 2025న విడుదల కానుంది. జులై 7న కొత్త టీజర్ లేదా పాట విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. రిషబ్ శెట్టి ఇంటెన్స్ లుక్, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, భారీ యుద్ధ సన్నివేశాలతో ఈ చిత్రం మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Allu Arjun: మార్చి నుంచి బన్నీ, త్రివిక్రమ్ సినిమా స్టార్ట్..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *