Chiru-Boyapati: మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. యువ దర్శకులు వశిష్ఠ, అనీల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో ఆయన లైనప్ ఇప్పటికే సూపర్ స్ట్రాంగ్‌గా ఉంది. ఇప్పుడు మరో సంచలన కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో హాట్ బజ్ వినిపిస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చిరు సినిమా దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ కలయిక కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
బోయపాటి మాస్ మసాలా చిత్రాలకు పెట్టింది పేరు. చిరంజీవి బ్రాండ్‌కు తగ్గట్టు హై ఓల్టేజ్ యాక్షన్, డైలాగ్స్‌తో ఈ సినిమా రూపొందితే బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే, అభిమానులకు మాస్ పండగే. ఈ ప్రాజెక్ట్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!