Crackers: కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పెట్టె కింద పటాకులు పెట్టి.. దానిపై ఓ యువకుడు కూర్చోగా పటాకులు పేల్చారు. దీంతో ఆ యువకుడు మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. దీపావళి రోజు రాత్రి శబరీష్, అతని స్నేహితులు మద్యం సేవించారు. తర్వాత కోననకుంటె ప్రాంతంలో అందరూ గుమిగూడారు. తనకు ఇంటికి వెళ్ళడానికి ఆటో ఇప్పించాలని అతని స్నేహితులను నిరుద్యోగి అయినా శబరీష్‌ను కోరాడు. దానికి ఆ స్నేహితులు క్రాకర్స్ ఉన్న పెట్టెపై కూర్చుంటే, ఆటోలో ఇంటికి పంపిస్తామని చెప్పారు.
మద్యం మత్తులో ఉన్న శబరీష్ ఆ షరతుకు అంగీకరించాడు. స్నేహితులు పటాకులు రోడ్డుపై పేర్చి, దానిపై పెట్టె పెట్టారు. శబరీష్ దానిపై కూర్చున్నాడు. ఆతరువాత పటాకులకు నిప్పు అంటించి అతని స్నేహితులు అక్కడి నుంచి దూరంగా పరిగెత్తారు. వెంటనే ఆ బాణసంచా పేలడంతో శబరీష్ గాలిలో కి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు.
Crackers: కొన్ని సెకన్ల తర్వాత శబరీష్ స్నేహితులు అతని వద్దకు వచ్చారు. అతనిని లేపడానికి ప్రయత్నించారు. కానీ, శబరీష్ లో కదలిక రాలేదు. దీంతో స్నేహితులంతా కలిసి శబరీష్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
Crackers: పేలుడు కారణంగా శబరీష్ ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారని దక్షిణ బెంగళూరు ఎస్పీ లోకేష్ జగ్లాసర్ తెలిపారు. దీంతో అతడు చనిపోయినట్టు వెల్లడించారు. శబరీష్ స్నేహితులను గుర్తించారు. 6 గురిని అరెస్టు చేసి హత్యానేరం కేసు నమోదు చేశారు.

