CPI Narayana: భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సీపీఐ జాతీయ నేత కే నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తొలినాళ్లలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. యుద్ధం వద్దని, ఉగ్రవాదాన్ని అణచాల్సిందేనని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల మన దేశ ప్రజలతోపాటు పాకిస్థాన్‌లోని సామాన్యులు సైతం తీవ్ర ఇబ్బందుల పాలవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన వ్యాఖ్యలపై కొందరు అభ్యంతరాలను వ్యక్తంచేశారు.
ప్రస్తుతం కాల్పుల విరమణ సందర్భంగా ఆయన ఆ అభ్యంతరాలపై స్పందించారు.
CPI Narayana: భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణ జరిగింది. దీంతో తాను తొలుత శాంతి చర్చలు జరగాలని తాను అన్నందుకు ఒకప్పుడు తనను పాకిస్థాన్ పంపాలని కొందరు అన్నారని, మరి ఇప్పుడు ప్రధాని మోదీని పాకిస్థాన్ పంపించాలా? అని నారాయణ ప్రశ్నించారు.
CPI Narayana: భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణను నారాయణ స్వాగతిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తాను శాంతి చర్చలు జరగాలని కోరుకుంటే కొందరు పాకిస్థాన్ పంపాలని అవాకులు, చవాకులు పేలారని చురకలు అంటించారు. భారత్ పీవోకేను ఆక్రమించకుండా ఎందుకు కాల్పుల విరమణకు వెళ్లిందని ఈ సందర్భంగా నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

