CP Sajjanar

CP Sajjanar: మియా.. డ్రింక్ చేశావా? స్టీరింగ్‌కు సలాం కొట్టు!.. న్యూ ఇయర్ ‘మందుబాబుల’కు సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్

CP Sajjanar: న్యూ ఇయర్ వేడుకల జోష్‌లో ఉన్న నగరవాసులకు, ముఖ్యంగా మందుబాబులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తనదైన శైలిలో ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం చట్టాలు చెబితే వినరని భావించారో ఏమో కానీ, పక్కా హైదరాబాదీ యాసలో ఆయన ఇచ్చిన పంచ్‌లు చూసి మందుబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

లాయర్ కంటే క్యాబ్ మిన్న!

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో సీపీ చేసిన ట్వీట్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. గూగుల్‌లో లాయర్ కోసం వెతకడం కంటే, క్యాబ్ కోసం వెతకడం చాలా మిన్న! తాగిన తర్వాత డ్రైవింగ్ చేసి పోలీసులకు దొరికితే.. కేసుల కోసం వేలకు వేలు లాయర్లకు తగలేయడం కంటే, ఓ వంద రూపాయలు పెట్టి క్యాబ్ బుక్ చేసుకోవడం మంచిదని ఆయన హితవు పలికారు. చలాన్లు, కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ, జైలు శిక్షల ఖర్చుతో పోలిస్తే క్యాబ్ ఖర్చు చాలా తక్కువని బాధ్యతాయుతంగా గుర్తుచేశారు.

‘మా డాడీ ఎవరో తెలుసా?’ – ఇక కుదరదు బాస్!

సాధారణంగా తనిఖీల్లో పట్టుబడినప్పుడు చాలామంది “మా నాన్న ఎవరో తెలుసా?”, “మా అంకుల్ ఎవరో తెలుసా?” అంటూ పొలిటికల్ పవర్ చూపిస్తుంటారు. దీనికి సజ్జనార్ తన మార్కు కౌంటర్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Chandrababu: అయోధ్యలో బాలరాముడి చెంత చంద్రబాబు.. ‘రాముడి ఆదర్శాలే మనకు మార్గదర్శకం’!

మీ పరపతి గురించి మా ఆఫీసర్లను అడగొద్దు.. మీ ప్రైవసీని మేము గౌరవిస్తాం. వాహనం పక్కన పెట్టండి.. డేట్ వచ్చాక కోర్టులోనే పరిచయం చేసుకుందాం” అంటూ ఘాటుగా స్పందించారు.

నియమాలు ఉల్లంఘిస్తే ‘యాక్షన్ గ్యారెంటీ’!

“మియా.. డ్రింక్ చేశావా? అయితే స్టీరింగ్‌కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు” అంటూ స్నేహపూర్వకంగా చెబుతూనే, రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. వేడుకలను ఎంజాయ్ చేయండి కానీ, బాధ్యత మరిచి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నదే పోలీసుల సందేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *