Covid-19:దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతున్నది. నిన్నటి నుంచి 24 గంటల్లోనే 500కు పైగా కేసులు పెరిగాయి. దీంతో 5,364గా నమోదైంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ గణాంకాలను ప్రకటించింది. ఒక్క రోజులోనే 4 కొవిడ్ మరణాలు సంభవించాయి. 24 గంటల్లోనే కేరళ రాష్ట్రంలో ఇద్దరు చనిపోయారు. పంజాబ్, కర్ణాటకలో ఒక్కొక్కరి చొప్పున మృతిచెందారు.
Covid-19:దేశంలో కేరళలోనే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్న కేరళలో అత్యధికంగా 1,487 కేసులు నమోదవగా, జూన్ 6న ఆ సంఖ్య 1,679గా నమోదైంది. 24 గంటల్లో 300 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో తగు జాగ్రత్తలు పాటించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి.
Covid-19:ఇదిలా ఉండగా మునపటిలాగా తీవ్రత లేదని, జలుబు, జ్వరం, నొప్పులతో మూడు నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక జబ్బులున్న వారు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కరోనా పెరుగుతున్న రాష్ట్రాల్లో వివిధ ఆసుపత్రుల్లో కరోనా వార్డుల సంఖ్యను పెంచుతున్నారు.