Covid-19: ఆకస్మిక వరుస మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్ కారణమన్న విషయాలపై కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పందించింది. అక్కడి ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్లకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇతర సమస్యల కారణంగా ఆకస్మిక గుండె సంబంధిత మరణాలు సంభవిస్తున్నాయని కేంద్రం వెల్లడించింది.
Covid-19: కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఇటీవల 40 రోజుల్లో 23 మంది యువతీ యువకులు చనిపోయారు. వారంతా 19 నుంచి 25 ఏళ్ల లోపు వయసున్న యువతే కావడం గమనార్హం. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొవిడ్ వ్యాక్సిన్ కారణం కావచ్చా? అని అక్కడి వైద్యారోగ్య శాఖ అధికారులను నివేదిక కోరారు. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
Covid-19: ఈ నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పందించింది. చనిపోయిన వారికి గతంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు, కొవిడ్ అనంతరం తలెత్తిన సమస్యలే ఆకస్మిక మరణాలకు కారణం అయి ఉండొచ్చని కేంద్ర వైద్యారోగ్య శాఖ తేల్చి చెప్పింది. 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారిలో ఆకస్మిక మరణాల ప్రమాదాన్ని కొవిడ్ వ్యాక్సిన్ పెంచలేదని పలు పరీక్షల్లో తేలిందని స్పష్టం చేసింది.