Covid-19: తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆ జిల్లాలోని తంగళ్లపల్లికి చెందని ఓ వ్యక్తి వారం క్రితం హైదరాబాద్‌కు వెళ్లొచ్చాడు. పాజిటివ్‌గా తేలడంతో బాధితుడిని వైద్యాధికారులు హోంక్వారంటైన్‌లో ఉంచారు. దీంతో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నదని ఆందోళన నెలకొన్నది. అయితే ఇప్పుడు వచ్చే కొవిడ్‌తో అంతగా ప్రమాదమేమీ లేదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.
