Telangana: దీపాదాస్ మున్షీ దావా కేసులో బీజేపీ నేత ప్ర‌భాక‌ర్ గైర్హాజ‌రు.. కోర్టు సీరియ‌స్‌

Telangana: కాంగ్రెస్ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ వేసిన ప‌రువు న‌ష్టం దావా కేసులో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ గైర్హాజ‌రుపై నాంప‌ల్లి కోర్టు సీరియ‌స్ అయింది. గురువారం విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌న్న కోర్టు ఆదేశాల‌ను ఆయ‌న పాటించ‌లేద‌ని త‌ప్పుబ‌ట్టింది. న‌వంబ‌ర్ 5న జ‌రిగే విచార‌ణ‌కు త‌ప్ప‌క హాజ‌రుకావాల‌ని కోర్టు ఆదేశించింది.

Telangana: అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ల కోసం దీపాదాస్ మున్షీ కోట్లాది రూపాయ‌లు, బెంజి కార్లు లంచంగా తీసుకున్నార‌ని బీజేపీ నేత ప్ర‌భాక‌ర్ ఆరోప‌ణ‌లు గుప్తించారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై మున్షీ కోర్టును ఆశ్రయించారు. ఇప్ప‌టి వ‌రకు వాయిదాల‌కు ప్ర‌భాక‌ర్ హాజ‌రు కాలేదు. గురువారం విచార‌ణ‌కూ హాజ‌రుకాక పోవ‌డంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Maharashtra: ఇదో రాజకీయ విచిత్రం.. బీజేపీ సీటు ఇవ్వలేదని కూటమిలోని వేరే పార్టీకి జంప్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *