AR Rahman: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌తోనే భారీ అంచనాలు సృష్టించింది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై క్రేజ్ రెట్టింపు అయింది. అయితే, రెహమాన్‌పై తాజాగా ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’లోని ‘వీరా రాజ వీరా’ పాటకు రెహమాన్ సంగీతం కాపీ చేశారని సింగర్ ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ డగర్ ఆరోపించారు. తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ స్వరపరిచిన శివస్తుతి పాట నుంచి ట్యూన్ కాపీ చేశారని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు రెహమాన్, మద్రాస్ టాకీస్‌లు పిటీషనర్‌కు రూ.2 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
Also Read: NTRNeel: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో శ్రుతి హాసన్!
AR Rahman: ఈ తీర్పుతో రెహమాన్ కాపీ ఆరోపణల్లో చిక్కుకున్నారు. దీంతో ‘పెద్ది’ సినిమా సంగీతంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెహమాన్ ఈసారి ఒరిజినల్ ట్యూన్స్‌తో అదరగొడతారా లేక మరో వివాదంలో చిక్కుకుంటారా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ :
