Court: మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన కోర్ట్ మూవీ అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రీమియర్స్ రూపంలో దాదాపు రెండు కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ తో మొత్తంగా రూ. 8.10 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.
ఇక వీకెండ్ కావడంతో శని, ఆదివారం అన్ని సెంటర్స్ లో ఫుల్స్ తో భారీ కలెక్షన్స్ రాబట్టింది కోర్ట్. వీకెండ్ ను దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని థియేటర్స్ ను యాడ్ చేసారు మేకర్స్. ఇక రెండు రోజులుకు గాను వరల్డ్ వైడ్ గా రూ.15.90 కోట్లు రాబట్టింది.
Also Read: Kayadu Lohar: స్పీడ్ పెంచిన డ్రాగన్ బ్యూటీ.. తెలుగులో రెండు సినిమాలు సైన్ చేసిన అమ్మడు
మొదటి వీకెండ్ మూడు రోజులకు గాను రూ. 24.4 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఓవర్సీస్ లో కూడా కోర్ట్ అద్బుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. ప్రీమియర్స్ తో పాటు మూడు రోజుల్లో మొత్తం 600K డాలర్స్ కొల్లగొట్టి దూసుకెళుతోంది కోర్ట్.