ZPTC Election Counting: ఈ రోజు కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వై.ఎస్. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం అయినందున పులివెందుల ఉప ఎన్నిక ఫలితాల కోసం రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కౌంటింగ్ కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం లోపు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
కడప నగరంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పులివెందులకు ఒకే రౌండ్‌లో ఓట్లను లెక్కించేందుకు 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట కౌంటింగ్ మూడు రౌండ్లలో, 10 టేబుళ్లపై జరగనుంది. ఈ ప్రక్రియలో సుమారు 100 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: Personal vehicles Tax: తెలంగాణలో వాహనదారులకు షాక్: బైకులు, కార్లపై పెరిగిన లైఫ్ ట్యాక్స్.
ఈ ఉప ఎన్నికల్లో పులివెందులలో 74 శాతం, ఒంటిమిట్టలో 86 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మధ్య నువ్వానేనా అన్నట్లుగా జరిగాయి. అయితే, ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ కౌంటింగ్‌ను బహిష్కరించింది. మరోవైపు, పులివెందులలోని 3, 14 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు బుధవారం రీ-పోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో, ఈరోజు వెలువడే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.