Costly Condom

Costly Condom: ఒక్క కండోమ్ వేల రూపాయలు.. ప్రపంచంలోనే ఖరీదైంది.. ఎందుకో తెలుసా?

Costly Condom: కండోమ్.. సురక్షితమైన శృంగారం కోసం.. గర్భనిరోధక సాధనంగా అందరికీ తెలిసిందే. కండోమ్ కొనాలంటే ఎంత ఉంటుంది? ఎక్కువలో ఎక్కువ 100 రూపాయలు అంతే కదా. కానీ, ఒక కండోమ్ వేలంలో వేలాది రూపాయలు పలికింది. అన్ని వేలు ఖరీదు చేయడానికి ఆ కండోమ్ స్పెషాలిటీ ఏమిటి? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవాల్సిందే. 

Costly Condom: ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కండోమ్ ఇప్పటిది కాదు. దాదాపు 200 ఏళ్ల క్రితంది. దీనిని ఇటీవల వేలం వేశారు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు సృష్టించింది. ఈ కండోమ్ వేలంలో ఇంతకు అమ్ముడుపోయిందో తెలుసా? £460లకు అంటే దాదాపు 44 వేల రూపాయలకు. ఇంత ఖరీదు ఉండడానికి కారణం పురాతన కండోమ్ కావడం ఒక్కటే కాదు మరో కారణం కూడా ఉంది. 

Also Read: అందమైన చైనా గవర్నర్ కు జైలు శిక్ష.. ఏకంగా 58 మందితో..!

ఈ కండోమ్ ఆధునిక లేటెక్స్ కండోమ్స్ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ కండోమ్స్ అప్పట్లో గొర్రెల పేగుల నుంచి తయారు చేశేవారు. ఇవి 18-19 శతాబ్దాలకు చెందినవిగా రికార్డ్స్ చెబుతున్నాయి. 

Costly Condom: అప్పట్లో గొర్రెలు, పందులు, దూడలు, మేకలు వంటి జంతువుల పేగుల నుంచి కండోమ్‌లను తయారు చేసేవారు. అందుకే ఈ కండోమ్స్  చాలా ఖరీదైనదిగా ఉండేది. పైగా అప్పటి కాలంలో ధనవంతులు మాత్రమే వీటిని ఉపయోగించేవారు. సామాన్యులకు దీనిపై పెద్దగా అవగాహన ఉండేది కాదు. ఈ  19 సెం.మీ (7 అంగుళాలు) కండోమ్ ఫ్రాన్స్‌లో దొరికింది. ఇది ఇప్పుడు ఇది వేలంలో రూ. 44,000 కు అమ్మకం జరిగింది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *