Corona: ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఇన్ఫెక్షన్లు గణనీయంగా పెరగడమే కాకుండా, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, కోవిడ్ కేసులు, ఆసుపత్రి చేరికలు, మరణాల రేటు ఈ నగరాల్లో ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి.
కొత్త వేరియంట్ల ప్రభావం
నిపుణుల అభిప్రాయం ప్రకారం, గతంలో తీసుకున్న వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గడమే కాకుండా, తాజా వేరియంట్లు అయిన LP.8.1 మరియు XFC వేగంగా వ్యాపిస్తున్నాయి. దీనివల్ల కరోనా మళ్లీ ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా LP.8.1 వేరియంట్ ప్రబలంగా ఉంది. డాక్టర్ మార్క్ ఈ రూప్ వివరించిన ప్రకారం, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో సుమారు 70% ఈ వేరియంట్ వల్ల, 9% ఎక్స్‌ఎఫ్‌సీ వేరియంట్ వల్ల ఉన్నాయి.
ప్రత్యామ్నాయ చర్యలు
ఈ వేరియంట్లు ప్రాణాంతకంగా కాకపోయినా, తక్కువ రోగనిరోధక శక్తి కలిగినవారిలో వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. అమెరికా FDA ఇటీవల నోవావాక్స్ అభివృద్ధి చేసిన కొత్త బూస్టర్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. నిపుణులు కోవిడ్‌ను ఫ్లూ లాంటి సీజనల్ వ్యాధిగా పరిగణించి, బూస్టర్ డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు.
WHO హెచ్చరిక
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే LP.8.1 వేరియంట్‌ను ‘మానిటరింగ్‌లో ఉన్న వేరియంట్’గా గుర్తించింది. ఇది యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఏప్రిల్ నుంచి ప్రబలంగా వ్యాపిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, మాస్క్‌లు ధరించడం, బూస్టర్ డోసులు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.