Coolie

Coolie: ముగింపు దశలో కూలీ షూటింగ్.. క్లైమాక్స్ కోసం కసరత్తులు!

Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూలీ. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ చేసుకుంటోంది. వచ్చే వారంలో ఓ ప్రత్యేక సెట్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను ఘాట్ చేస్తారట. ఈ క్లైమాక్స్ కోసం కొన్ని స్పెషల్ స్టంట్స్ ప్లాన్ చేసారు. రజని డూప్ పై ఈ స్టంట్స్ ను షూట్ చేస్తారట.ఇక మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలోనే ఈ సినిమా తొలి గ్లింప్స్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్‌ అంశంతో ముడిపడి ఉన్న యాక్షన్‌ కథాంశంతో ఈ సినిమా ముస్తాబవుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Minister Jadhav: త్వరలో క్యాన్సర్కు టీకా.. తేల్చి చెప్పిన కేంద్ర ఆరోగ్య మంత్రి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *