Coolie: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కూలీ’ హైప్‌ను మరోస్థాయికి తీసుకెళ్తోంది. ఈ సినిమాలో రజనీ సరసన బ్యూటీ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనుంది. తాజా ఇంటర్వ్యూలో పూజా స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది.
‘జైలర్’లో తమన్నా ‘కావాలయ్యా’ సాంగ్‌కు భిన్నంగా, ఈ పాట ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉంటుందని చెప్పింది. సంగీత సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ సాంగ్‌కు బీట్స్ అందిస్తుండగా, రజనీ ఫ్యాన్స్‌కు ఇది మరో విజువల్ ట్రీట్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ‘కూలీ’ ఆగస్ట్ 14న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Also Read: Miss Telugu USA: మిస్ తెలుగు యూఎస్ఏ గ్రాండ్ ఫినాలేకు సెలబ్రిటీ జడ్జిగా గీతామాధురి
Coolie: రజనీకాంత్ మ్యాజిక్, అనిరుద్ మ్యూజిక్, పూజా హెగ్డే గ్లామర్ కలయికతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘కూలీ’తో రజనీ మరోసారి తన సత్తా చాటనున్నారని ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

