Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా చెన్నై విమానాశ్రయంలో రజనీపై కీలక సన్నివేశాలను తీశారు. త్వరలోనే వైజాగ్, హైదరాబాద్‌లలో ఆఖరి షెడ్యూల్ జరగబోతుంది.ఇక మార్చి నాటికి షూటింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ అంశంతో ముడిపడి ఉన్న యాక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవి చందర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తుండగా, సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
