Coolie Movie Review: కూలీ నటీనటులు.. రజనీకాంత్, నాగార్జున, సౌబీన్ షాషిర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్, రెబా మోనికా జాన్, పూజా హెగ్డే తదితరులు నటించారు..
సినిమాటోగ్రఫి: గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్: ఫిలోమన్ రాజ్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
నిర్మాత: కళానిధి మారన్
బ్యానర్: సన్ పిక్చర్స్
కథ:
ముప్పై ఏళ్ల క్రితం దేవా (రజనీకాంత్) ఒక కూలీగా జీవనం సాగిస్తాడు. తర్వాత స్నేహితులతో కలిసి హాస్టల్ నడిపే స్థాయికి ఎదుగుతాడు. ఆయన ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ (సత్యదేవ్) అనుకోకుండా చనిపోతే, చివరి చూపుకు వెళ్లిన దేవాను, రాజశేఖర్ కుమార్తె ప్రీతి (శృతి హాసన్) అడ్డుకుంటుంది. అయితే రాజశేఖర్ గుండెపోటుతో కాకుండా ఎవరో చంపారని దేవాకు తెలుస్తుంది. నిజం కనుగొనే ప్రయత్నంలో దేవా, దయాల్ (సౌబిన్ సాహిర్) గురించిన షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు.
ఈ క్రమంలో గ్యాంగ్ లీడర్ సైమన్ (నాగార్జున)కి దేవా గురించి సమాచారం అందుతుంది. వీరందరికీ మెక్సికోలో ఉన్న దహా (అమీర్ ఖాన్)తో కనెక్షన్ ఉంటుంది. గోల్డ్ బిజినెస్ పేరుతో జరుగుతున్న అసలు ఆట ఏమిటి? ఈ నెట్‌వర్క్ వెనుకున్న రహస్యమేంటన్నది మిగతా కథ.
రివ్యూ:
కూలీ కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, రజినీ అభిమానులకు కావాల్సిన కమర్షియల్ మసాలా మాత్రం పుష్కలంగా ఉంది. మొదటి భాగం వేగంగా, ఆకర్షణీయంగా సాగుతుంది. కానీ రెండో భాగం లోకేష్ కనకరాజ్ పాత అలవాటు మాదిరిగా స్లో అయి, ఊహించదగ్గ రీతిలో నడుస్తుంది. మొదటి సీన్ చూసి చివరి సీన్ ఊహించగలిగేంత ఈజీ స్క్రీన్‌ప్లే ఉండటం మైనస్.
అయినా యాక్షన్ సీన్లు, సౌబిన్ షాహిర్ క్యారెక్టర్ బలంగా నిలుస్తాయి. నాగార్జున విలన్‌గా ఇంప్రెస్ చేసినా, ఆయనపై మనకు ఉన్న హీరో ఇమేజ్ ఈ పాత్రను పూర్తిగా నమ్మించదు. ఉపేంద్ర ఎంట్రీ స్క్రీన్‌కు కొత్త ఉత్సాహం తెస్తుంది. అయితే అమీర్ ఖాన్ ఎంట్రీ రోలెక్స్ కాపీలా అనిపించి పెద్దగా కిక్ ఇవ్వదు.
నటీనటుల ప్రదర్శన:
-
రజనీకాంత్: దేవా పాత్రలో స్టైల్, ఎనర్జీతో రఫ్ఫాడించాడు. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో బాషా గుర్తొస్తుంది.
-
నాగార్జున: శాతం వంద శాతం ట్రై చేసినా, విలన్ రోల్‌లో మిక్స్‌డ్ ఫీలింగ్.
-
సౌబిన్ సాహిర్: బలమైన, సర్‌ప్రైజ్ చేసే పాత్ర.
-
శృతి హాసన్, ఉపేంద్ర: తమ పాత్రల్లో ఓకే.
-
అమీర్ ఖాన్: పాత్ర రోలెక్స్ ఇన్స్పిరేషన్ అనిపించినా, ఇంపాక్ట్ తక్కువ.
టెక్నికల్ అంశాలు:
అనిరుద్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం. సినిమాటోగ్రఫీ గ్రాండ్‌గా, విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో బాగుంది కానీ సెకండ్ హాఫ్‌లో పేస్ పడిపోయింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ విలువలు అద్భుతం.
మొత్తానికి:
కూలీ ఒక రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్. కథలో కొత్తదనం లేకపోయినా, రజినీ స్టైల్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, టెక్నికల్ విలువలు సినిమాను చూడదగ్గదిగా చేస్తాయి. రజినీ అభిమానులు మాత్రం మాస్ మూమెంట్స్‌తో ఎంజాయ్ చేస్తారు.
రేటింగ్: ⭐⭐⭐ (3/5)