Naga Vamsi: విజయ్ దేవరకొండ.. యూత్‌లో క్రేజ్‌తో పాటు వివాదాల్లోనూ చిక్కుకుంటున్న హీరో. ఆయనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలు ఎప్పటికీ తగ్గడం లేదు. కానీ, నిర్మాత నాగవంశీ మాత్రం విజయ్ను సమర్థిస్తూ మాట్లాడారు. విజయ్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఆయన టాలెంట్‌ను గుర్తించడం లేదని అన్నారు. రాబోయే చిత్రం కింగ్డమ్తో విజయ్ దేవరకొండ తన సత్తా చాటనున్నాడని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Tamannaah: ఇన్ఫ్లూయెన్సర్ కల్చర్‌పై తమన్నా సంచలన కామెంట్స్!
ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. యాక్షన్, డ్రామాతో కూడిన ఈ చిత్రం విజయ్ కెరీర్లో కీలక మలుపు అవుతుందని నాగవంశీ అంటున్నారు. అభిమానులు కూడా కింగ్డమ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ తన విమర్శకులకు సమాధానం చెబుతాడా? అనవసర వివాదాలను అధిగమించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తాడా? అనేది చూడాలి.

