Congress:సెప్టెంబర్ 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే వివిధ రూపాల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కామారెడ్డి సభ ద్వారా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
Congress:కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆహ్వానించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వీరితోపాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలకు ఆహ్వానాలు పంపనున్నట్టు తెలిసింది. ఈ సభ కాంగ్రెస్ పార్టీకి ఒక కీలకమైన సభగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Congress:సెప్టెంబర్ 8న టీపీసీసీ కీలక సమావేశం హైదరాబాద్‌లో జరగనున్నది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోబోయే వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ నాయకులను సమన్వయం చేయడానికి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఎన్నికల ప్రణాళిక, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై తగు సూచనలు చేసే అవకాశం ఉన్నది.