Manickam Tagore: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తునట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ మేరకులు పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ బిల్లుపైన మాట్లాడారు అమరావతి చట్టబద్ధతకు తమ పార్టీ తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, పన్ను రాయితీలు ఇంకా పరిశ్రమలకు రాయితీలు ఇస్తామన్న వాగ్దానాలు ఇంకా నెరవేరలేదని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి మోడీ సభలో ఇచ్చిన హామీ ఇప్పటికీ పెండింగ్లోనే ఉండటంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ మౌనంగా ఉండబోదని స్పష్టం చేశారు. అమరావతి నగరం హైదరాబాద్ మరియు బెంగళూరు తరహాలో గొప్పగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ఆయన, ఏపీకి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు అమరావతి రైతులకు మరియు ప్రజలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
