Komatireddy Raj Gopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇవ్వమని రెండుసార్లు హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదని ఆయన ఆరోపించారు.
“మాటిచ్చారు, కానీ అమలు చేయడం ఆలస్యం చేస్తున్నారు. సమీకరణాలు కుదరడం లేదంటున్నారు. అసలు ఎవరు అడ్డుకుంటున్నారు? పార్టీలోకి తీసుకున్నప్పుడు మేము అన్నదమ్ములమని తెలియదా?” అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: RGV: ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ
రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం కూడా సమర్థులమే, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఖమ్మం జిల్లాకు 9 ఎమ్మెల్యేలతో ముగ్గురు మంత్రులు ఉంటే, నల్గొండ జిల్లాకు 11 ఎమ్మెల్యేలతో ముగ్గురు మంత్రులు ఉండడంలో తప్పేముంది?” అని అన్నారు.
తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆలస్యమైనా ఓపిక పడతానని, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే అది తనకు అన్యాయం చేసినట్టేనని హెచ్చరించారు. “భగవంతుడు ఏ పదవి ఇచ్చినా అది మునుగోడు ప్రజల కోసం మాత్రమే, నా కోసం కాదు” అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

