Congress Defeat: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం, బీజేపీ (భారతీయ జనతా పార్టీ) గణనీయమైన ఆధిక్యం సాధించింది. 70 సీట్లలో 43 స్థానాల్లో బీజేపీ ముందున్నట్లు ఓట్ల లెక్కింపు సూచిస్తోంది. ఇది 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ సంఖ్య నుండి గణనీయమైన మెరుగుదలను సూచిస్తుంది. ఈ విజయం దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని కోల్పోయేలా చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ 27 సీట్లతో వెనుకబడి ఉంది. ఇది గత రెండు ఎన్నికల్లో అఖండ విజయాలు సాధించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీకి గణనీయమైన నష్టం. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏ సీటును గెలుచుకోలేకపోయింది, ఇది వారి కొనసాగుతున్న రాజకీయ పతనాన్ని సూచిస్తుంది.
ఇది కూడా చదవండి: KTR: బీజేపీ గెలిచింది.. రాహుల్ గాంధీకి కంగ్రాట్స్.. కేటీఆర్ సెటైర్ మామూలుగా లేదుగా!
కాగా, కాంగ్రెస్ ఢిల్లీలో హైట్రిక్ కొట్టింది. వరుసగా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ “జీరో” తో నిలిచింది. ఒక జాతీయ పార్టీ.. దేశాన్ని దశబ్దాలుగా ఏలిన పార్టీ.. పదిహేనేళ్లుగా దేశ రాజధానిలో ఒక్క ఎమ్మెల్యే సిటు గెలవకపోవడం కాంగ్రెస్ దుస్థితిని సూచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!
Well done 👏 https://t.co/79Xbdm7ktw
— KTR (@KTRBRS) February 8, 2025